Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమాని చివరి కోరిక తీర్చిన సినీనటుడు అల్లు అర్జున్

  • బోన్‌ కేన్సర్‌తో బాధితుడుతోన్న అభిమాని దేవసాయి ‌గణేశ్
  • తన చివరి కోరిక బన్నిని చూడడమేనని చెప్పిన అభిమాని
  • అనాకపల్లికి వెళ్లి కలిసిన బన్ని
విశాఖపట్నంలోని అనాకపల్లిలో బోన్‌ కేన్సర్‌తో బాధితుడుతోన్న దేవసాయి గణేశ్‌ అనే యువకుడికి సినీనటుడు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న దేవసాయి గణేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన అభిమాన నటుడు అల్లు అర్జున్‌ను చూడాలని, అదే తన చివరి కోరిక అని వైద్యులకి చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్‌... ఈ రోజు సాయంత్రం అనకాపల్లికి వెళ్లి దేవసాయి గణేశ్‌ ను పరామర్శించాడు. దేవసాయి గణేశ్‌ను ఆప్యాయంగా పలకరించి కాసేపు మాట్లాడాడు. దీంతో దేవసాయి గణేశ్‌ హర్షం వ్యక్తం చేశాడు.          
Allu Arjun
fan
Vizag

More Telugu News